Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి'(Kalki). నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ డే బుకింగ్స్ అన్ని ఆల్ మోస్ట్ హాట్ కేకుల్లా అమ్ముడయిపోయాయి. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా టికెట్ ధరలకు సంబంధించి ముంబై రికార్డులు సృష్టిస్తుంది. ముంబయిలోని మైసన్ ఐనాక్స్ థియేటర్లలో ఈ సినిమా టికెట్లు ఏకంగా రూ.950 నుంచి స్టార్ట్ అయ్యి రూ.2300గా ఉన్నాయి. అయితే ఈ టికెట్లు కూడా సోల్డ్ అవుట్ అవ్వడం విశేషం. అలానే వీకెండ్ కోసం ఒక్కో టికెట్‌ను రూ.2000కు అమ్ముతోందట. దీంతో టాలీవుడ్లోనే కాకుండా ప్రభాస్ క్రేజ్ ముంబయి వరకు పాకిందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
మరోవైపు ఈ సినిమా స్పెషల్ షోలు నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చింది. ఐదు షోలు వేసేందుకు, టికెట్ ధర రూ.200 పెంచుకునేందుకూ హోంశాఖ వారికి అనుమతులు ఇచ్చింది. అలాగే రూ.75, రూ.100 టిక్కెట్ల ధరలనూ పెంచుకునేందుకూ అనుమతులు ఇచ్చింది. ఇక పెరిగిన ధరలను బట్టి టికెట్ల రేట్లను చూసుకుంటే.. బెనిఫిట్ షోల రేట్లు.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.377 గా.. మల్టీప్లెక్స్‌లలో రూ.495 గా ఉండబోతుంది. ఇక బెనిఫిట్ షో అనంతరం రెగ్యులర్ షోల రేట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.265 ఉండగా.. మల్టీప్లెక్స్‌లలో రూ. 413 గా నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి..