Kalki 2898 AD | టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌కు కూడా చాలా రోజులకు ఒక మంచి హిట్ వచ్చింది. జున్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే రూ.700 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రూ.1000 కోట్ల మార్క్‌కు దగ్గరగా వెళుతుంది. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ వీడియో సాంగ్స్ ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ఇప్పటికే టక టక్కర(Ta Takkara) అని కాంప్లెక్స్‌లో సాగే పాటను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా హోప్ ఆఫ్ శంభాల (Hope of Shambala) అంటూ మరో పాటను వదిలింది. ఇక ఈ పాటను మీరు చూసేయండి.
వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ రానున్న రోజుల్లో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని మూవీ లవర్స్ అప్పుడే అంచనాలు వేసేసుకుంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు.