Devara | ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘దేవర పార్ట్-1’ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ వెలువడింది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా రెండో గీతాన్ని ఈ నెల 5న విడుదల చేయబోతున్నారు. శుక్రవారం ఈ పాట తాలూకు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనిరుధ్ సంగీతాన్నందిస్తున్న ఈ పాట రొమాంటిక్ మెలొడీగా ఆకట్టుకుంటుందని, ఎన్టీఆర్ నృత్యాలు, జాన్వీకపూర్ అందచందాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్, హరికృష్ణ కె. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.