పారిస్: జాన్వీకపూర్(Janhvi Kapoor) తన ఇన్‌స్టాలో కొత్త ఫోటోలను పోస్టు చేసింది. ప్యారిస్ హాట్ కౌటర్ వీక్‌లో భాగంగా జరిగిన ఫ్యాషన్ షోలో ఆమె పాల్గొన్నది. ఆ షోలో జరిగిన క్యాట్వాక్లో దేవర నటి స్పెషల్‌గా కనిపించింది. మిస్టర్ అండ్ మిస్సెస్ మహిలో నటించిన ఆ బాలీవుడ్ భామ.. మత్స్యకన్య లాంటి డ్రెస్సులో హోయలు పలికింది. ప్యారిస్ ఫ్యాషన్ షోకు వెళ్లిన ఆమె.. అక్కడ దిగిన రకరకాల ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది.
హోటల్ రూమ్ బాల్కనీలో కూర్చున్న ఫోటోను కూడా జాన్వీ పోస్టు చేసింది. బ్లాక్ డ్రెస్సులో జలకన్య తరహాలో ర్యాంప్‌పై నడస్తున్న ఫోటోను కూడా రిలీజ్ చేసిందామె. ఫ్యాషన్ షోకు రెఢీ అవుతున్న సమయంలో దిగిన డ్రెస్సింగ్, మేకప్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా పోస్టులో పెట్టిందామె.
ఓ పసందమైన పారిస్ వంటకాన్ని తింటున్న ఫోటో కూడా ఆమె పోస్టులో ఉన్నది. ఆమె డిజైనర్ రాహుల్ మిశ్రాతో కూడా దిగిన ఫోటోను దఢక్ నటి తన ఇన్‌స్టాలో పెట్టింది. పువ్వుల గౌన్ వేసుకుని ఫ్రాన్స్ నగరంలో తిరుగుతూ.. అక్కడ చాక్లెట్ తింటున్న ఫోటోను కూడా జాన్వీ రిలీజ్ చేసింది.