Suriya – Karthik Subbaraju | తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువ సినిమా చేస్తున్న సూర్య ఈ చిత్రం అనంతరం ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగరతో సూర్య43 చేయబోతున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు షూటింగ్లో ఉండగానే సూర్య మరో స్టార్ దర్శకుడితో చేతులు కలిపాడు.
‘జిగర్ తండా డబుల్ ఎక్స్'(Jigarthanda Double X)తో బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju)తో తన తదుపరి సినిమా చేయనున్నాడు సూర్య. సూర్య44 రానున్న ఈ ప్రాజెక్ట్‌ను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. అయితే ఈ సినిమా హీరోయిన్‌కు సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో కథానాయికగా బుట్టబోమ్మ పూజా హెగ్డే నటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు ఈ సినిమా షూటింగ్‌ను జూన్ నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు వెల్లడించాడు.
Delighted to welcome @hegdepooja for #Suriya44 🔥
Welcome onboard #PoojaHegde 💃🏻#LoveLaughterWar ❤️🔥 #AKarthikSubbarajPadam📽️@Suriya_offl @Music_Santhosh @rajsekarpandian @kaarthekeyens @kshreyaas @cheps911 @jacki_art @JaikaStunts @PraveenRaja_Off @2D_ENTPVTLTD @stonebenchers… pic.twitter.com/uias057s2B
— karthik subbaraj (@karthiksubbaraj) June 1, 2024