హవీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్ బాస్’. కె స్టూడియోస్ పతాకంపై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ‘భాగమతి’ ఫేమ్ అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. మంగళవారం హవీష్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నేటి ట్రెండ్‌కు తగినట్లుగా ఉండే లవ్‌స్టోరీ ఇది. బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపిస్తారు. హవీష్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కబీర్‌లాల్, సంగీతం: అనూప్ రూబెన్స్.