Prabhas | అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు హను రాఘవపూడి (Hanu Raghavapudi). ఆ తర్వాత పలు సినిమాలు తెరకెక్కించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ 2022లో సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత కొత్త సినిమా ఏం ప్రకటించలేదు. తాజాగా ఆసక్తికర అప్డేట్ ఒకటి ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)కు కథను వినిపించాడని, ఫైనల్ డ్రాప్ట్ చూసిన ప్రభాస్ ఇంప్రెస్ అయ్యాడని ఓ వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ చిత్రం సీతారామం, రాధేశ్యామ్ లా వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుండగా.. కొన్ని ఎపిసోడ్స్‌లో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నాడట. అంతేకాదు ప్రభాస్ మొదట లుక్ టెస్ట్, ఫొటోషూట్ చేయాలని హను రాఘవపూడికి సూచించాడని మరో ఆసక్తికర వార్త మూవీ లవర్స్‌లో జోష్ నింపుతోంది.
ఇదే నిజమైతే రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై మెరువడం ఖాయమైనట్టే. హను రాఘవపూడి మరి ప్రభాస్‌ను ఎలా చూపిస్తాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తోన్న సలార్ 2ను పూర్తి చేయనున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ డిసెంబర్లో మొదలు పెట్టబోతున్నాడు.
ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)తోపాటు మారుతి డైరెక్షన్లో రాజాసాబ్, ప్రశాంత్‌నీల్ ప్రాంఛైజీ ప్రాజెక్ట్ సలార్ 2 సినిమాలు చేస్తున్నాడు. కాగా ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ ఫోకస్ అంతా కల్కి 2898 ఏడీపైనే ఉంది.