H Vinoth | కోలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్ల జాబితాలో ఒకరు హెచ్ వినోద్ (H Vinoth) . స్టార్ యాక్టర్ కార్తీ (Karthi)తో తెరకెక్కించిన ఖాకీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ తెచ్చుకోవడమే కాదు.. డైరెక్టర్‌గా హెచ్ వినోద్‌కు సూపర్ క్రేజ్ సంపాదించి పెట్టింది. వలిమై, తునివు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన మార్క్ చూపించిన ఈ దర్శకుడు ఇప్పటికే విజయ్‌తో కలిసి దళపతి 69 చేస్తుండగా.. త్వరలోనే ఈ మూవీతో బిజీ అవబోతున్నట్టు ప్రకటించాడు.
తాజాగా హెచ్ వినోద్ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వార్త నెట్టింట రౌండప్ చేస్తోంది. ఖాకీ 2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త ఇప్పుడు అభిమానుల్లో జోష్ నింపుతోంది. దళపతి 69 షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుందట. లేటెస్ట్ సమాచారం ప్రకారం మిడ్ 2026లో సీక్వెల్ షూటింగ్ మొదలు కానుంది. ఇదే నిజమైతే కార్తీ-వినోద్ కాంపౌండ్ నుంచి మరో బ్లాక్ బస్టర్ సినిమా రావడం పక్కా అయిపోయినట్టేనంటున్నాడు ట్రేడ్ పండితులు, మూవీ లవర్స్.
కార్తీ త్వరలోనే పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రాబోతున్న సర్దార్ సీక్వెల్ సర్దార్ 2 (Sardar 2) షూట్లో జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. మిషన్ కంబోడియా నేపథ్యంలో సర్దార్ 2 ఉండబోతుందని ఇప్పటికే తెలియజేశారు మేకర్స్ . సర్దార్ 2 షూటింగ్ చెన్నై, కజకిస్తాన్, అజర్బైజాన్, జార్జియాలో కొనసాగించనున్నట్టు ఇన్సైడ్ టాక్.
ఈ చిత్రంలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ కీలక పాత్రలో కనిపించబోతుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కార్తీ మరోవైపు నలన్ కుమారస్వామి డైరెక్షన్లో వా వాథియారే సినిమా చేస్తున్నాడు.
Sunaina | యూట్యూబర్‌తో మరాఠీ భామ నిశ్చితార్థం.. క్రేజీ గాసిప్‌లో నిజమెంత..?
Chiyaan Vikram | స్టన్నింగ్‌గా చియాన్ విక్రమ్ యాక్టింగ్.. తంగలాన్ రిలీజ్‌పై నిర్మాత క్లారిటీ
Atlee | అట్లీ అలా చెప్పాడో లేదో.. సల్మాన్ ఖాన్ మల్టీస్టారర్‌పై ఇంట్రెస్టింగ్ న్యూస్
మిషన్ కంబోడియా..
#Sardar 💥
Once a spy, always a spy!
Mission starts soon!!#Sardar2 💥💥@Karthi_Offl @Prince_Pictures @RedGiantMovies_ @Psmithran @gvprakash @lakku76 @RaashiiKhanna @rajishavijayan @ChunkyThePanday @george_dop @AntonyLRuben @dhilipaction @kirubakaran_AKR @DuraiKv pic.twitter.com/rVu5IxGRZp— Prince Pictures (@Prince_Pictures) October 25, 2022