Guruvayoor Ambalanadayil | మలయాళం నుంచి వచ్చి రీసెంట్గా సూపర్ హిట్ అందుకున్న చిత్రం ‘గురువాయుర్ అంబలనాడయిల్’ (Guruvayoor Ambalanadayil). సలార్ ఫేమ్, మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran), మిన్నల్ మురళీ ఫేమ్ బసిల్ జోసెఫ్(Basil Joseph) కీలక పాత్రలో నటించగా అనస్వర రాజన్, నిఖిల విమల్ కథానాయికలుగా నటించారు. విపిన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 16న విడుదలై మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.90 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమయ్యింది.
ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ డిస్నీ+హాట్స్టార్లో ఈ చిత్రం జూన్ 27 నుంచి మలయాళంతో పాటు, తెలుగు, కన్నడ, తమిళం హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తమిళ నటుడు యోగి బాబు, సిజు సన్నీ, ఇర్షాద్ అలీ, రమేష్ కొట్టాయం, బైజు సంతోష్, రేఖ, పి పి కున్హికృష్ణన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
Guruvayoor Ambalanadayil will start streaming on DisneyPlus Hotstar from tomorrow.#GuruvayoorAmbalanadayil #DisneyPlusHotstar #GuruvayoorAmablanadayilOnDisneyPlusHotstar #Prithviraj #BasilJoseph #NikhilaVimal #AnaswaraRajan #Bromance #GAN #Brotherhood #RomanticComedy pic.twitter.com/4gkXKdE8bS
— DisneyPlus Hotstar Malayalam (@DisneyplusHSMal) June 26, 2024
ఇవి కూడా చదవండి..