స్వీయ దర్శకనిర్మాణంలో చంద్రశేఖర్ రాథోడ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్‌స్టర్’. కాశ్వీ కాంచన్ కథానాయిక. ఆగస్ట్‌లో విడుదలకానుంది. శుక్రవారం టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రాథోడ్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘నాలుగేళ్ల కిందట ఈ కథ రాసుకున్నా. రెండు గ్యాంగ్స్‌ల మధ్య పోరాటం నేపథ్యంలో కథ సాగుతుంది.
రచయిత విజయేంద్రప్రసాద్‌గారికి టీజర్ చూపిస్తే బాగుందని మెచ్చుకున్నారు. త్వరలో దిల్‌రాజుగారికి కూడా టీజర్ చూపించబోతున్నా’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. అభినవ్ జనక్, అడ్ల సతీష్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జీఎల్ బాబు, సమర్పణ: రవి అండ్ నరసింహా, ఫైట్స్, కొరియోగ్రఫీ, ఎడిటింగ్, రచన, నిర్మాత, దర్శకత్వం: చంద్రశేఖర్ రాథోడ్.