Game Changer | రామ్‌చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా అప్డేట్ వచ్చేసింది. ‘ఇండియన్ – 2’ ప్రమోషన్లో భాగంగా దర్శకుడు శంకర్ ఇచ్చిన ఓ తాజా ఇంటర్వ్యూలో ‘గేమ్‌ఛేంజర్’ గురించి మాట్లాడారు. ‘ ‘గేమ్ ఛేంజర్’ దాదాపుగా పూర్తయింది. ఇంకో పదిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలివుంది. ‘ఇండియన్-2’ హడావిడి ముగియగానే, ‘గేమ్ ఛేంజర్’ పని మొదలుపెడతా. ఫైనల్ అవుట్‌పుట్ చూసుకొని పోస్ట్‌ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తా. సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాకే విడుదల తేదీ ప్రకటిస్తాం’ అని తెలిపారు శంకర్.
సమకాలీన రాజకీయ సమస్యలే ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తండ్రీకొడుకులైన రామ్నందన్, అప్పన్నలుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. అంజలి, కైరా అద్వానీ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, సునీల్ కీలకపాత్రధారులు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా.