Trisha | నాలుగు పదుల వయస్సు దాటినా.. ఆ ఛాయలేమి కనిపించకుండా యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్న భామల్లో ఒకరు త్రిష (Trisha). ఈ చెన్నై చంద్రం ప్రస్తుతం మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తుంది. మరోవైపు తమిళంలో అజిత్ కుమార్ నటిస్తోన్న విదాముయార్చిలో కూడా హీరోయిన్గా నటిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా త్రిష ఓ సెల్ఫీని ఎక్స్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోకు ఉకియో అని క్యాప్షన్ ఇచ్చింది. ఇంతకీ త్రిష ఈ క్యాప్షన్‌తో ఏం చెప్పిందని ఆరా తీస్తున్నారు. ఉకియో జపనీస్ పదం.. ఉకియో అంటే తేలియాడే ప్రపంచం.. (ఫ్లోటింగ్ వరల్డ్) అని అర్థం. త్రిష తాజా సెల్ఫీతో తాను జపాన్‌లో ఉన్నానని చెప్పకనే చెబుతుందని అర్థమవుతోంది. మరి త్రిష ఏదైనా సినిమా షూటింగ్లో ఉందా..? అనేది తెలియాల్సి ఉంది.
Ukiyo🦦 pic.twitter.com/8MIIGtc6mi
— Trish (@trishtrashers) July 15, 2024
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?
Maharaja | ప్లాట్‌ఫాం ఏదైనా రెస్పాన్స్ ఒక్కటే.. విజయ్ సేతుపతి మహారాజ ట్రెండింగ్
Darling | ప్రియదర్శి డార్లింగ్‌కు సపోర్ట్‌గా స్టార్ హీరో.. మేకర్స్ నుంచి క్రేజీ వార్త