Disha Patani | బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani)కి సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పటికపుడు హాట్ హాట్ లుక్స్ లో కనిపిస్తూ నెట్టింగ సెగలు పుట్టిస్తుంటుంది. ఈ భామ ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు కామెంట్లు, లైకుల వర్షం కురుస్తుంది.
రీసెంట్గా దిశాపటానీ ఎడమ చేతి మోచేతిపై ‘PD’ అని రాసి ఉన్న పచ్చబొట్టు ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. నా పచ్చబొట్టు చుట్టూ ఉన్న క్యూరియాసిటీ చూసి ఆనందించా. ఆ ఆనందం అంటే ఏంటో కనుగొనండి.. అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఫాలోవర్లు, నెటిజన్లు, అభిమానుల్లో పలు ఊహాగానాలకు దారి తీసింది.
‘PD’ని ‘ప్రభాస్ డార్లింగ్’గా డీకోడ్ చేసి.. ఆ టాటూను ప్రభాస్‌కు అంకితం చేసినట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే దిశాపటానీ నేడు కొత్త ఇన్స్టాగ్రామ్ వీడియోతో అందరినీ సైలెంట్ చేసింది. దిశాపటానీ అమెజాన్ ప్రైమ్ డే 2024 ప్రమోషన్ల కోసం ఇలా తాత్కాలిక టాటూ వేసుకున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది. ఈ లెక్కన PD అంటే ప్రైమ్ డే అని అర్థమన్నమాట.
ఇటీవలే దిశా పటాని ప్రభాస్‌తో కలిసి Kalki 2898 ADలో మెరిసింది. ప్రస్తుతం సూర్య-శివ కాంబినేషన్లో వస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువలో నటిస్తోంది. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది.