పృథ్వీ అంబర్ హీరోగా నటిస్తున్న ‘చౌకీదార్’ సినిమా షూటింగ్ ఇటీవల బెంగళూరులో మొదలైంది. చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. విద్యాశేఖర్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కల్లహళ్లి చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు.
నిజ జీవితానుభవాలతో దర్శకుడు ఈ కథ రాసుకున్నాడని, ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుందని హీరో పృథ్వీ అంబర్ తెలిపారు. సవాలుతో కూడుకున్న పాత్రలో నటిస్తున్నానని సాయికుమార్ అన్నారు. మల్టీలాంగ్వేజ్ చిత్రమిదని, కుటుంబ బంధాల నేపథ్యంలో కథ సాగుతుందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సచిన్ బస్రూర్.