Chiyaan Vikram | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) అభిమానులు ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ తంగలాన్ (Thangalaan). పా రంజిత్ దర్శకత్వంలో హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రాన్ని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది.
ఈ నేపథ్యంలో అప్డేట్స్ ఎప్పుడెప్పుడొస్తాయా ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం ట్రైలర్ న్యూస్ బయటకు వచ్చింది. ట్రైలర్ సెన్సార్ పూర్తయింది. ట్రైలర్ రన్ టైం 2 నిమిషాల 12 సెకన్లు. అంతేకాదు పక్కా సినిమాటిక్ మ్యాజిక్ అందించే ట్రైలర్ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
18వ శతాబ్దం-19వ శతాబ్దం మధ్య సాగే కేజీఎఫ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అడ్వెంచరస్ డ్రామా నేపథ్యంలో.. బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ తిరిగే స్టోరీతో తంగలాన్ సాగనుందని ఇప్పటికే లాంచ్ చేసిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ఈ మూవీని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. మరోవైపు మాళవికా మోహనన్ లుక్ విడుదల చేయగా.. డీగ్లామరైజ్డ్గా కనిపిస్తూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
“Release Date Announcement loading”
– Trailer RunTime “2 minutes 12 sec
Movie Release Plan To August 15th#ChiyaanVikram #VeeraDheeraSooran #Chiyaan63 pic.twitter.com/Zdsrd76N05
— Movie Tamil (@MovieTamil4) July 4, 2024
తంగలాన్ మేకింగ్ గ్లింప్స్ వీడియో..
తంగలాన్ స్పెషల్ వీడియో..