బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాతా మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మ ఆనందం’. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. రాజా గౌతమ్ పాత్ర పరిచయంతో ఈ గ్లింప్స్ మొదలైంది. అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్న హోప్లెస్ యువకుడిగా రాజా గౌతమ్, అతని స్నేహితుడిగా వెన్నెలకిశోర్ ఈ గ్లింప్స్‌లో కనిపిస్తున్నారు. బ్రహ్మానందం ఎంట్రన్స్‌తో గ్లింప్స్ మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన మళ్లీరావా, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, మసూద చిత్రాలు మంచి సక్సెస్‌లు అందుకున్నాయి. దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయని మేకర్స్ తెలిపారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హూలక్కల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: మితేష్ పర్వతనేని, సంగీతం: శాండిల్య పిసపాటి.