NBK 109 | నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం NBK109 సినిమా చేస్తున్నాడని తెలిసిందే. బాబీ (Bobby) డైరెక్ట్ చేస్తున్నాడు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
బాబీ డియోల్ బాలయ్య టీం ఘనంగా స్వాగతం పలికింది. మాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో చాందినీ చౌదరి కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసిన ఎన్బీకే 109 గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతోంది. బాలయ్య చేతిలో గొడ్డలి పట్టుకొని జీపులో నుంచి దిగుతున్నట్టుగా ఉన్న స్టిల్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. పాపులర్ బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ ఎన్బీకే 109 సెట్స్‌లో జాయిన్ అయ్యాడు.
వేటగాడు ఎంట్రీ ఇచ్చాడు. బాబీడియోలో మీ అద్భుతమైన స్క్రీన్ ప్రజెంటేషన్ మా NBK109 టీంతోపాటు మూవీ లవర్స్, నందమూరి అభిమానులకు మరింత ప్రత్యేకం కానుంది.. అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ, బాబీ డియోల్ దిగిన స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీలో ఊర్వశి రౌటేలా పోలీసాఫీసర్‌గా కనిపించబోతుంది.
ఎన్బీకే 109లో బాబీ డియోల్ విలన్‌గా కనిపించబోతున్నట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. యానిమల్‌లో అదిరిపోయే యాక్టింగ్‌తో అదరగొట్టిన బాబీ డియోల్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.
ఎన్బీకే 109 టీం స్వాగతం..
THE HUNTER ENTERS💥
Welcome aboard #BobbyDeol garu 🔥
Your terrific screen presence is set to make our #NBK109 more special for us movie lovers and NBK fans. ❤️🔥#NandamuriBalakrishna @dirbobby @MusicThaman @thedeol @Vamsi84 @KVijayKartik #SaiSoujanya @chakrif1 @SitharaEnts… pic.twitter.com/sIw8DpjWBF
— Sithara Entertainments (@SitharaEnts) April 23, 2024