Bad Newz | విక్కీ కౌశల్, అమ్మి విర్క్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం Bad Newz. ఆనంద్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యానిమల్ ఫేం తృప్తి డిమ్రి (Tripti Dimri) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. నేహా ధూపియా కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రం జులై 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఏదో ఒక అప్డేట్తో ప్రమోషన్స్ వేగవంతం చేస్తున్నారు.
తాజాగా ఈ మూవీ నుంచి తొలి పాట Tauba Taubaను రేపు లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సాంగ్ సూపర్ స్టైలిష్‌గా ఉండబోతున్నట్టు ప్రోమో చెప్పకనే చెబుతోంది. పాపులర్ సింగర్, ర్యాపర్ Karan Aujla, విక్కీ కౌశల్ కాంబోలో తొలిసారి వస్తున్న ఈ పార్టీ యాంథెమ్ గురించి క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.
Bad Newz పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో (పోస్ట్ థ్రియాట్రికల్) స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, ప్రమోషన్స్ తో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అవుతోంది.
పార్టీ సాంగ్ నయా లుక్..
𝐊𝐀𝐑𝐀𝐍 𝐀𝐔𝐉𝐀𝐋𝐀 – 𝐕𝐈𝐂𝐊𝐘 𝐊𝐀𝐔𝐒𝐇𝐀𝐋 𝐂𝐎𝐋𝐋𝐀𝐁𝐎𝐑𝐀𝐓𝐄𝐒 𝐅𝐈𝐑𝐒𝐓 𝐓𝐈𝐌𝐄 𝐅𝐎𝐑 𝐀 𝐏𝐀𝐑𝐓𝐘 𝐀𝐍𝐓𝐇𝐄𝐌 #BadNewz First Song #TaubaTauba will be out tomorrow. #VickyKaushal #TriptiDimri #DharmaProductions pic.twitter.com/20uG8RSFfc
— Sumit Kadel (@SumitkadeI) July 1, 2024
Thalapathy 69 | విజయ్ దళపతి 69 హీరోయిన్ ఫైనల్.. డైరెక్టర్‌పై క్లారిటీ..!
Srikanth Odela | పాతబస్తీ నేపథ్య కథలో..? నానితో దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మూవీ!