Allari Naresh | టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ సినిమాకు సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తుండగా.. హాస్యా మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఇందులో నరేష్ కి జోడీగా అమృత అయ్యర్ కనిపించనుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి సాలిడ్ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రేపు మధ్యాహ్నం 12.06 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
ఇక అల్లరి నరేశ్‌కి ఇది 62వ చిత్రం. ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో ఉండబోతుండగా.. తుని ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. రావు రమేశ్, హరితేజ, ప్రవీణ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
బచ్చల మల్లి 🔥 pic.twitter.com/nElGqF9DBn
— Allari Naresh (@allarinaresh) May 27, 2024