Good Bad Ugly | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith kumar) కాంపౌండ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తోన్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో నటిస్తోన్న గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly). యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. ఇప్పటికే లాంచ్ చేసిన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా యాక్షన్ ప్యాక్డ్ డ్రామా నేపథ్యంలో ఉండబోతుందని హింట్ ఇచ్చేస్తుంది.
తాజాగా ఈ మూవీ సెకండ్ లుక్ విడుదల చేశారు. అజిత్ కుమార్ ఖైదీ గెటప్‌లో స్టైలిష్‌గా చీర్ అప్ మూడ్‌లో ఉండగా.. బ్యాక్‌డ్రాప్‌లో గన్స్ రౌండప్ చేయడం చూడొచ్చు. ఆ దేవడి ఆశీస్సులు మీపై ఉండాలి అజిత్ కుమార్ సార్ అంటూ రిలీజ్ చేసిన నయా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్లో భాగంగా ఇటీవలే హైదరాబాద్‌లో ఇప్పటికే అజిత్‌పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్‌తోపాటు ఓ ఫైట్ సీక్వెన్స్ షూట్ ప్లాన్ చేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ మూవీకి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. 2025 పొంగళ్ కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తు్న్నారు. అజిత్‌కుమార్ మరోవైపు మగిజ్ తిరుమేని డైరెక్షన్లో Vidaa Muyarachi సినిమాలో కూడా నటిస్తున్నాడని తెలిసిందే. త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇటీవలే అజర్బైజాన్ వెళ్లింది. అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
Second look of #GoodBadUgly #GBU mamae God Bless u❤️🙏🏻 My sir #AK sir @MythriOfficial #Naveen sir, #Ravi sir , Dinesh sir @SureshChandraa sir ❤️🙏🏻 pic.twitter.com/JH2KQrD7qE
— Adhik Ravichandran (@Adhikravi) June 27, 2024
Samantha | జోన్ మిచెల్‌తో సమంత.. ఇంతకీ ఏ సెషన్లో పాల్గొన్నదంటే..?
Raayan | కౌంట్ డౌన్ షురూ.. రాయన్ ప్రమోషన్స్‌లో ధనుష్ టీం