సాధారణంగా షూటింగ్లో బిజీగా గడిపే కథానాయకులు తమకు సంబంధం లేని ఒకరి కోసం సమయం కేటాయించడం చాలా అరుదు. అయితే కేవలం సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాలు చురుకుగా పాల్గొనే సెలబ్రిటిస్ మాత్రమే అలా చేస్తుంటారు. ఈ కోవకి చెందిన వాడే హీరో అడవి శేష్. వైవిధ్యమైన సినిమాలతో.. విభిన్న కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న శేష్..క్వాంటీటీ ఆఫ్ సినిమాల కంటే క్వాలిటీ ఆఫ్ సినిమాలను నమ్ముకునే హీరో. అయితే హీరోగా తాజాగా తన మంచి మనసును చాటుకున్నాడు. సమాజానికి ఉపయోగపడే పలు కార్యక్రమాలు చేసే అడవి శేష్ ఇటీవల క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్ని పాపతో రోజంతా సమయాన్ని గడిపారు. సినీ పరిశ్రమకు చెందిన ఓ సన్నిహిత వ్యక్తి ద్వారా ఈ చిన్ని అభిమాని గురించి తెలుసుకున్న శేష్, త్వరగా ఆమె, కుటుంబ సభ్యులని సంప్రదించారు. ఆ చిన్నారితో వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ అయ్యారు. చిన్నారి మెసేజులకు రిప్లేయ్ ఇచ్చారు. అంతే కాదు చిన్నారి కోసం ఒక క్యూట్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. ఒక ప్రముఖ హోటల్లో ఫ్యామిలీ కోసం డే అవుట్ ని ప్లాన్ చేసి, అక్కడ చిన్నారిని కలసి.. చిన్నారితో పాటు వాళ్ల కుటుంబాన్ని సర్ప్రైజ్ చేశారు. ఇక పాపతో రోజంతా సరదాగా ఆడుతూ గడిపారు. దీంతో పాటు ఆ చిన్నిపాప, ఆమె కుటుంబ సభ్యులతో ఎప్పుడూ సన్నిహితంగా ఉంటున్న శేష్, అవసరమైనప్పుడు తన సపోర్ట్ ఉంటుందని చెప్పారు. కన్సల్టేషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వారిని మళ్లీ కలుసుకున్నారు. శేష్‌కి డై – వీర అభిమాని అయిన ఆ చిన్నారి తన అభిమాన హీరోని కలవాలని చాలా కాలంగా కలలుకంది. ఆమె పరిస్థితి తెలుసుకున్న శేష్, ఆమె కలను నిజం చేయాలని నిర్ణయించుకున్నారు. రీల్ హీరోనే కాదు.. రియల్ హీరోనని తన గొప్ప మనసుని చాటుకున్నాడు.