Aditi Rao Hydari | బాలీవుడ్ నటి అదితి రావు హైదరీ (Aditi Rao Hydari)కి ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. యూకేలోని హీత్రూ విమానాశ్రయం(UK Heathrow Airport)లో తన లగేజీ మాయమైందని, దానికోసం గంటల తరబడి విమానాశ్రయంలో ఎదురుచూస్తూ కూర్చోవాల్సి వచ్చిందని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నటి అదితీరావు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఈ ఘటనపై అధికారులను అడిగితే వారు చేతులెత్తేశారని, సంబంధిత ఎయిర్‌లైన్ ను సంప్రదించమన్నారని పేర్కొన్నారు. ఇంత చెత్త ఎయిర్‌పోర్టును తానెప్పుడూ లైఫ్‌లో చూడలేదంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసింది. తమిళ నటుడు సిద్ధార్థ్‌తో త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది అదితి. రీసెంట్గా ‘హీరామండి’ అనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అదితీ.. ఇందులో ‘బిబోజాన్’ అనే పాత్రలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం పార్ట్ 2 కు రెడీ అవుతుంది.
ఇవి కూడా చదవండి..