ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘35 చిన్నకథకాదు’. నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హీరో రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నుంచి విశ్వదేవ్ ఫస్ట్‌గ్లింప్స్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో ఆయన్ని బాధ్యత కలిగిన మధ్యతరగతి తండ్రి పాత్రలో చూపించారు.
నేటితరం పిల్లలు, తల్లిదండ్రుల మధ్య అనుబంధాన్ని, సంఘర్షణను ఆవిష్కరించే చిత్రమిదని, తిరుపతి నేపథ్యంలో కథ నడుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. వివేక్‌సాగర్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.