96 రీమేక్ త‌ర్వాత సినిమాల‌కి బ్రేక్ ఇవ్వ‌నున్న సామ్..!

Thu,September 12, 2019 12:37 PM
Whats next for Samantha

అక్కినేని మూడోత‌రం వార‌సుడు నాగ‌చైత‌న్య‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత స‌మంత వ‌రుస స‌క్సెస్‌లు సాధిస్తుంది. ఇటీవ‌ల ఓ బేబి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన స‌మంత ప్ర‌స్తుతం 96 రీమేక్ చిత్రంలో న‌టిస్తుంది. త‌మిళ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు వ‌ర్షెన్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి జాను లేదా జానకి దేవి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. శ‌ర్వానంద్ చిత్రంలో కెమెరామెన్‌గా క‌నిపించ‌నున్నాడు. సెప్టెంబ‌ర్ 16 నుండి చిత్రానికి సంబంధించి మ‌రో షెడ్యూల్ మొద‌లు కానుంది. అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ తొలి వారంలో చిత్ర షూటింగ్ పూర్తి కానుంద‌ని అంటున్నారు. అయితే ఈ చిత్రం త‌ర్వాత స‌మంత ప‌లు ప్రాజెక్టుల‌లో న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా, అవన్నీ అవాస్త‌వాలు అంటున్నారు. 96 రీమేక్ త‌ర్వాత కొద్ది రోజుల పాటు స‌మంత సినిమాల‌కి బ్రేక్ తీసుకొని మాతృత్వం పొందేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటుంద‌ని స‌మాచారం.

2159
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles