ల‌వ‌బుల్ క‌పుల్‌ని విడదీసిన బిగ్ బాస్..!

Sun,October 20, 2019 09:56 AM

బిగ్ బాస్ హౌజ్‌లోకి మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా వ‌రుణ్ సందేశ్‌, వితికా షెరు ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికి ఇలాంటి అవ‌కాశం రాక‌పోగా, తొలిసారి ఆ ఛాన్స్ అందుకున్నారు వ‌రుణ్ జంట‌. తొలి రోజు నుండి కంబైన్డ్ గేమ్ ఆడుతున్న వ‌రుణ్ సందేశ్, వితికా షెరులు విడిపోయే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని చెబుతున్నారు. తొలి రోజుల‌లో వితికాపై నెగెటివ్ ఒపినీయ‌న్ బాగా ఉన్నా, ఆమె నామినేష‌న్‌లోకి పెద్ద‌గా రాలేదు. అయితే ఈ వారం అంద‌రు నామినేష‌న్‌లోకి రావ‌డంతో వితికానే ఎలిమినేట్ అయ్యే కీల‌క‌మైన వ్య‌క్తి గా మారింది. ఇప్ప‌టికే బాబా భాస్క‌ర్, రాహుల్‌, శ్రీముఖి సేవ్ కాగా నామినేష‌న్‌లో వితికా, శివ‌జ్యోతి, వ‌రుణ్ సందేశ్‌, అలీ రెజా ఉన్నారు. వీరంద‌రిలో వితికానే కాస్త వీక్‌గా క‌నిపిస్తుండ‌డంతో ఈ వారం ఇంటి నుండి వితికా బయ‌ట‌కి వెళుతుంద‌ని చెబుతున్నారు. గ‌త ఎపిసోడ్‌లోను హౌజ్‌మేట్స్ కుటుంబ స‌భ్యులు అంద‌రు వితికాకి ఆరు, ఏడు స్థానాలు అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే. చూడాలి మ‌రి ఏం జ‌ర‌గుతుందో..!

9625
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles