కర్వా చౌత్ వేడుక‌ని ఘ‌నంగా జ‌రుపుకున్న సినీ ప్ర‌ముఖులు

Fri,October 18, 2019 01:18 PM

దీపావ‌ళికి ముందు వ‌చ్చే చవితి నాడు నార్త్‌కి చెందిన మ‌హిళ‌లు క‌ర్వా చౌత్‌ అనే పండుగ‌ని కొన్నాళ్ళ నుండి ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే . ఆ రోజు మ‌హిళ‌లు త‌న భ‌ర్త కోసం ఉప‌వాసం ఉంటూ సాయంత్రం వేళ పూజ నిర్వ‌హించి ఆ త‌ర్వాత జ‌ల్లెడ‌లో చంద్రుడుని చూసి అదే జ‌ల్లెడ‌లో భ‌ర్త ముఖాన్ని చూసి, ఉప‌వాసం విడిస్తే కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయ‌ని అక్క‌డి మ‌హిళ‌లు విశ్వ‌సిస్తారు. క‌ర్వాచౌత్ వేడుక‌లు ప్ర‌తి ఏడాది ముంబైతో పాటు ప‌లు ప్రాంతాల‌లో ఘ‌నంగా జ‌రుగుతున్నాయి . గురువారం సాయంత్రం సినీ, క్రీడా ప్ర‌ముఖులు త‌మ కుటుంబాల‌తో క‌లిసి ఈ వేడుక‌ని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా క‌ర్వా చౌత్ శుభాకాంక్ష‌లు కూడా తెలియ‌జేశారు.


అనీల్ క‌పూర్ అతని భార్య సునీత క‌పూర్ ఈ వేడుక‌లో భాగంగా ర‌వీనా టాండ‌న్, శిల్పా శెట్టి, ప‌ద్మిని కోల్హాపురే, భావ‌న పాండేల‌ని త‌మ ఇంటికి ఆహ్వానించారు. ఇక ఐశ్వ‌ర్య‌రాయ్ త‌న అత్త‌మ్మ జ‌యా బ‌చ్చ‌న్‌, శ్వేతా బ‌చ్చ‌న్ నందా, ఆరాద్య‌, సోనాలి బింద్రేతో క‌లిసి క‌ర్వా చౌత్ వేడుక‌ల‌ని జ‌రుపుకుంది. ఇక గ్లోబ‌ల్ భామ ప్రియాంక చోప్రా కూడా క‌ర్వా చౌత్ వేడుక‌ని జ‌రుపుకుంది. పెళ్లి త‌ర్వాత వీరికి ఇది తొలి క‌ర్వా చౌత్ కాగా, లాస్ ఏంజెల్స్‌లో జ‌రిగిన జోనాస్ కాన్స‌ర్ట్‌లో ఈ వేడుక జ‌రుపుకుంది ప్రియాంక‌. అనుష్క శ‌ర్మ‌, శ్రియా శ‌రణ్‌తో పాటు ప‌లువురు ప్రముఖులు కూడా వేడుక‌ని ఘ‌నంగా జ‌రుపుకున్నారు.
View this post on Instagram

✨🌝💕🤗✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

View this post on Instagram

Moon spotting 🌝✨ #KarwaChauth 📸: Jaya aunty

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on

View this post on Instagram

Happy Karva Chauth ❤️

A post shared by Maheep Kapoor (@maheepkapoor) on

5077
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles