విజ‌య్ సేతుప‌తి పేరుతో చిత్రం.. టీజ‌ర్ విడుద‌ల‌

Sat,November 9, 2019 08:09 AM

త‌మిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న న‌టుల‌లో విజ‌య్ సేతుప‌తి ఒకరు. ఆయ‌న హీరోగా తమిళంలో ‘సంగతమిళన్’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను తెలుగులో ‘విజయ్ సేతుపతి’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను తమిళంలో విజయ ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది. తెలుగులో నిహార్షిత మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది. రెండు భాషల్లో నవంబర్ 15న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో విజ‌య్ సేతుప‌తి రౌడీల భ‌ర‌తం ప‌డుతున్నారు. డైలాగ్స్ కూడా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. మంచి మాస్ సినిమాగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. చిత్రంలో నివేద పేతురాజ్, నాజర్, అశుతోష్ రాణా, రవికిషన్ శుక్లా, తులసి తదితరులు నటించారు. వివేక్ - మెర్విన్ సంగీతం సమకూర్చారు. విజయ చందర్ దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కింది. ఇదిలా ఉంటే మక్కల్ సెల్వన్‌ విజయ్ సేతుపతి ఇటీవ‌ల‌ ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. ప్ర‌స్తుతం ఆయన తెలుగులో ‘ఉప్పెన’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

517
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles