త‌న టీం మెంబ‌ర్స్‌కి బంగారు ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన హీరో

Wed,August 14, 2019 08:44 AM
vijay gifted gold ring to his team mates

ఈ మ‌ధ్య స్టార్ హీరోలు ఇండ‌స్ట్రీలో కొత్త సంప్ర‌దాయాన్ని తీసుకొచ్చారు. త‌మ‌కి మంచి హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడికో లేదంటే క‌లిసి పని చేసిన టీం మెంబ‌ర్స్‌కో బ‌హుమ‌తులు ఇస్తున్నారు. తాజాగా ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న టీం మెంబ‌ర్స్ కి బిగిల్ పేరుతో రాసి ఉన్న బంగారు ఉంగరాన్ని గిఫ్ట్‌గా అందించాడు. విజ‌య్ త‌న పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకోవ‌డంతో టీం అంద‌రికి దీపావ‌ళి కానుక‌గా గోల్డెన్ రింగ్‌ని బ‌హుమ‌తిగా ఇచ్చాడు. విజ‌య్ హీరోగా అట్లీ దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో బిగిల్ సినిమా రూపొందుతుంది. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీలో కథిర్, యోగిబాబు, రెబా మోనికా జాన్, వివేక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రంలో విజ‌య్ గ్యాంగ్‌స్ట‌ర్ పాత్రతో పాటు ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ పాత్రలో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. విజ‌య్ - అట్లీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తెరీ, మెర్స‌ల్ చిత్రాలు భారీ విజ‌యం సాధించ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. దీపావ‌ళికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.1574
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles