డియ‌ర్ కామ్రేడ్‌కి పోటీగా ఆరు సినిమాలు..!

Tue,July 23, 2019 10:09 AM
Vijay Devarakonda fight with 6 kollywood moovies

మ‌రో మూడు రోజుల‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు వ‌స్తున్న చిత్రం డియ‌ర్ కామ్రేడ్. గీతా గోవిందం చిత్రం త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంథాన క‌లిసి న‌టించిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో పాటు సాంగ్స్‌కి కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రంలో కేవ‌లం తెలుగులోనే కాకుండా త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌లోను ఈ నెల 26న రిలీజ్ కానుంది. అయితే తెలుగులో ఈ చిత్రానికి పోటీగా మ‌రే సినిమా విడుద‌ల కాక‌పోయిన‌, త‌మిళంలో మాత్రం ఆరు సినిమాలు పోటీ ప‌డేందుకు సిద్ధ‌మ‌య్యాయి.

కోలీవుడ్‌లో జూలై 26న స్టార్ కమెడియన్ సంతానం నటించిన ఏ1, లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొలైయుధిర్ కాలం, దర్శకుడు సముద్ర ఖని నటించిన కొలాంజి, నుంగంబాకం,చెన్నై పళని మార్స్, ఆరడి అనే చిత్రాలు విడుద‌ల‌కి సిద్దం అయ్యాయి. ఈ చిత్రాల‌లో ఏ1,కొలైయుధిర్ కాలంకి అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. మ‌రి ఈ చిత్రాల‌తో డియ‌ర్ కామ్రేడ్ పోటీ ప‌డ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌తో చెన్నైలో దుమ్ము రేపిన విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాపై భారీ అంచనాలు పెంచాడు. ఇప్ప‌టికే నోటా సినిమాతో కోలీవుడ్‌లో బోల్తా ప‌డ్డా విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సారైన త‌న సత్తా నిరూపించుకుంటాడా అనేది చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా,జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు . శృతి రామచంద్రన్,సుహాస్,చారు హాసన్,ఆనంద్ ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

2040
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles