'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌'గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Tue,September 17, 2019 11:52 AM

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన‌ విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లి చూపులు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నాడు. ఆ త‌ర్వాత అర్జున్ రెడ్డి చిత్రం విజ‌య్ ఫేట్‌నే మార్చేసింది. దేశ వ్యాప్తంగా ఆయ‌న‌కి ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ సినిమా త‌ర్వాత గీత గోవిందం, ట్యాక్సీవాలా చిత్రాలు విజ‌య్‌కి మంచి విజ‌యం అందించాయి. ప్ర‌స్తుతం హీరో అనే సినిమా చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ తన తొమ్మిద‌వ సినిమాగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు . 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' డైరెక్టర్ క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయ్యింది. కానీ ఇంతవరకు ఈ సినిమా పేరు అనౌన్స్ చెయ్యలేదు. తాజాగా చిత్ర టైటిల్ అనౌన్స్ చేశాడు. 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌' అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ ఫ‌స్ట్ లుక్‌ని సెప్టెంబ‌ర్ 20 సాయంత్రం 5గం.ల‌కి విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్,ఇజబెల్లా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో అధికభాగం పారిస్‌లో షూట్ చేశారు. మిగిలిన షూటింగ్‌ని హైదరాబాద్‌లో పూర్తి చేస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ గడ్డం పెంచుకుని హార్ట్ బ్రేక్ అయిన ఒక ఫెయిల్యూర్ లవర్‌లా క‌నిపిస్తాడ‌ని టాక్.

1986
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles