వెంకీ మామ ట్రైల‌ర్‌కి హ్యూజ్ రెస్పాన్స్

Sun,December 8, 2019 08:27 AM

వెంక‌టేష్‌, నాగ చైతన్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో బాబీ తెర‌కెక్కించిన చిత్రం వెంకీమామ‌. డిసెంబ‌ర్ 13న విడుద‌ల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఖ‌మ్మంలో జ‌రిగింది. ఇద్ద‌రు హీరోల‌తో పాటు క‌థానాయిక‌లు రాశీ ఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్‌లు సంద‌డి చేశారు. సినిమాకు సంబంధించి థియేట్రికల్‌ ట్రైలర్‌ను హీరోలు వెంకటేశ్, నాగచైతన్య విడుదల చేశారు. ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచాయి. ట్రైల‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే సినిమా మంచి హిట్ అవుతుంద‌ని ఫ్యాన్స్ అంటున్నారు.


ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వేదికపై హీరోయిన్‌లు పాయల్‌రాజ్‌పుత్, రాశీఖన్నాలతో కలిసి హీరోలు, డైరెక్టర్‌ బాబీ, యాంకర్‌ శ్రీముఖి.. చిత్రంలోని కొకొకోలా పెప్సీ.. వెంకీమామ సెక్సీ పాటకు స్టెప్‌లు వేసారు. వారి డ్యాన్స్‌ల‌కి అభిమానుల కేరింత‌లు తోడ‌వ్వ‌డంతో ఆడిటోరియం ద‌ద్ద‌రిల్లింది. థమన్ చిత్రానికి సంగీతం అందించ‌గా, సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌లు చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు

650
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles