న‌టుడిగా వినాయ‌క్.. బ‌ర్త్‌డే రోజు ప్రారంభం

Sat,September 14, 2019 01:32 PM

క‌మర్షియ‌ల్ చిత్రాల‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన వీవీ వినాయ‌క్ ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు అందించారు. కొద్ది రోజులుగా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ని పక్క‌న పెట్టిన వినాయ‌క్ న‌టుడిగా వెండితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. ఈ క్ర‌మంలో జిమ్‌లో భారీ వ‌ర్కవుట్స్ కూడా చేస్తున్నాడు. ఇటీవ‌ల వినాయక్ జిమ్‌లో వర్కవుట్ సెషన్‌లో పాల్గొన్న‌ప్పుడు తీసిన ఫొటో ఒకటి వైర‌ల్ అయింది. అందులో బరువు తగ్గి ఫిట్‌గా, స్లిమ్‌గా కనిపించారు. శరభ ఫేం నరసింహారావు డైరెక్షన్‌లో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం కాగా, ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 9న‌ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు టాక్. అక్టోబ‌ర్ 9 వినాయ‌క్ బ‌ర్త్‌డే కావ‌డంతో ఆ రోజే చిత్ర షూటింగ్ ప్రారంభించాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్నార‌ట‌. పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్క‌నున్న ఈసినిమా కథ 1980ల కాలం నాటికి సంబంధించిన‌దిగా తెలుస్తుంది. వివి వినాయక్ ఇప్పటికే ఠాగూర్, ఖైదీ నంబర్ 150, నేనింతే చిత్రాల్లో గెస్ట్ రోల్స్‌లో కనిపించాడు.

2237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles