రేపు ఉదయం మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్న వ‌ర్మ‌

Tue,November 19, 2019 11:01 AM

సిద్ధార్ధ తాతోలు- రామ్ గోపాల్ వ‌ర్మ క‌లిసి తెర‌కెక్కించిన కాంట్ర‌వ‌ర్షియ‌ల్ చిత్రం క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు. మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించిన విడుద‌లైన ప‌లు సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా, రేపు ఉద‌యం( నవంబ‌ర్ 20) 9.36ని.ల‌కి చిత్రం నుండి మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట‌ర్ షేర్ చేస్తూ తెలిపాడు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకున్న వివాదాస్పద అంశాల్ని స్పృశిస్తూ చిత్ర ద‌ర్శకుడు చిత్రాన్ని రూపొందించారని అర్థమవుతున్నది.

1082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles