హీరో నాగశౌర్యకు జరిమానా..

Wed,August 14, 2019 07:23 AM
Tollywood actor Naga Shaurya fined by Hyderabad Police

హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధ్దంగా కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం వేసుకున్న హీరో నాగశౌర్యకు ట్రాఫిక్ పోలీసులు రూ.500 జరిమానా విధించారు. మంగళవారం మధ్యా హ్నం బంజారాహిల్స్ రోడ్ నెం.1లో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న హీరో నాగశౌర్యకు చెందిన కారును ట్రాఫిక్ పోలీసులు ఆపారు. కారు అద్దాలకు బ్లాక్‌ ఫిలిం ఉండటాన్ని పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రవి గుర్తించారు. కారులోనే ఉన్న నాగశౌర్య అంగీకారంతో అప్పటికప్పడే బ్లాక్ ఫిలిమ్‌ను ట్రాఫిక్ పోలీసులు తొలగించడంతో పాటు రూ.500 జరిమానా విధించారు.

1622
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles