బాక్సాఫీసు వ‌ద్ద గ‌ర్జిస్తున్న 'ద ల‌య‌న్ కింగ్'

Mon,July 22, 2019 05:17 PM
The Lion King rules India Box Office, earns Rs 54.75 crore in three days

హైద‌రాబాద్: హాలీవుడ్ మూవీ ద ల‌య‌న్ కింగ్‌.. ఇండియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. బాక్సాఫీసు వ‌ద్ద గ‌ర్జిస్తున్న‌ది. డిస్నీ రూపొందించిన ఈ సినిమా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న‌ది. దేశ‌వ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజుల్లోనే 54.75 కోట్లు ఆర్జించింది. 1994లో వ‌చ్చిన ద ల‌య‌న్ కింగ్ సినిమానే.. కంప్యూట‌ర్ యానిమేష‌న్ టెక్నాల‌జీతో రూపొందించి రిలీజ్ చేశారు. సినిమాలోని సింబా, ముఫాసా క్యారెక్ట‌ర్లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి. ఇండియాలో మొత్తం 2140 స్క్రీన్ల‌లో సినిమాను విడుద‌ల చేశారు. ఇంగ్లీస్‌, హిందీ, త‌మిల్‌, తెలుగు భాషాల్లో సినిమా రిలీజైంది. మొద‌టి రోజు ఈ సినిమాకు 13.17 కోట్లు వ‌చ్చాయి. భార‌త్‌లో అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్‌, అవెంజ‌ర్స్ ఇన్ఫినిటీ వార్ త‌ర్వాత అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన హాలీవుడ్ సినిమాగా ద ల‌య‌న్ కింగ్ నిలిచింది.1713
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles