‘ది లయన్‌ కింగ్‌’ కలెక్షన్ల సునామి

Mon,August 12, 2019 06:00 PM
The Lion King is Now Highest Grossing Film of All Time


వాల్ట్‌డిస్నీ స్టూడియోస్‌ నిర్మించిన ‘ది లయన్‌ కింగ్‌’ బాక్సాపీస్‌ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. జులై 19న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. జాన్‌ పేవ్‌రూ దర్శకత్వం వహించిన ది లయన్‌ భారత్‌లో రూ.150 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 1.33 యూఎస్‌ బిలియన్‌ డాలర్లు (రూ.9454.30 కోట్లు) రాబట్టినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు.

వాల్ట్‌ డిస్నీ స్టూడియోస్‌ నిర్మాణంలో వచ్చిన బ్యూటీ అండ్‌ ద బీస్ట్‌ (2017)1.26 యూఎస్‌ బిలియన్‌ డాలర్లు రాబట్టగా..తాజాగా ది లయన్‌ కింగ్‌ ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లను రాబట్టిన యానిమేషన్‌ మూవీ ‘ప్రొజెన్‌’ ను అధిగమించడంతోపాటు ‘ఇంక్రెడిబుల్‌ 2’ చిత్రం రికార్డులను సైతం ది లయన్‌ కింగ్‌ కొల్లగొట్టి ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా రికార్డుల్లోకెక్కింది.

ది లయన్‌ కింగ్‌ చిత్రాన్ని తెలుగు, తమిళం, మళయాళం, హిందీ వెర్షన్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ వెర్షన్‌లో ముసాఫా, సింబా పాత్రలకు బాలీవుడ్‌ నటుడు షారుక్‌ఖాన్‌, షారుక్‌ కొడుకు ఆర్యన్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. హాలీవుడ్‌ వెర్షన్‌కు డోనాల్డ్‌ గ్రోవర్‌, బియాన్స్‌ నోలెస్‌, అల్పే వుడార్డ్‌ తోపాటు ఇతర నటీనటులు తమ గొంతు అరువిచ్చారు. తెలుగులో నాని, జగపతిబాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ది లయన్ కింగ్ బడ్జెట్ రూ.2 వేల కోట్లు

2653
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles