క్లైంట్‌కి క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్స్ ఇస్తున్న లాయ‌ర్- టీజ‌ర్

Sun,September 15, 2019 12:26 PM

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘తెనాలి రామ‌కృష్ణ బి.ఎ బి.ఎల్‌’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ ట్యాగ్ లైన్‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా రూపొందుతోంది. శ్రీ నీల‌కంఠేశ్వ‌ర స్వామి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రంలో సందీప్ కిష‌న్ లాయ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రంగా ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రాన్నితెర‌కెక్కించారు. లాఫింగ్ రైడ‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హ‌న్సిక, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం, సాయిశ్రీరాం సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో సందీప్ కిష‌న్ కేసులు వాదించ‌డం కోసం ఆఫ‌ర్స్ ఇస్తుంటారు. ఒక కేసు వాదిస్తే రెండో కేసు ఫ్రీ, పేటీఎంలో పే చేస్తే 50 శాతం క్యాష్ బ్యాక్. కేసు పూర్తిగా ఓడిపోతే 100 శాతం క్యాష్ బ్యాక్ అని బంప‌ర్ ఆఫ‌ర్స్ ఇస్తున్నాడు. మీరు టీజ‌ర్ చూసి న‌వ్వుకోండి

1538
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles