రాజ‌శేఖ‌ర్ కారు బోల్తా.. ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డ యాంగ్రీ మెన్‌

Wed,November 13, 2019 08:21 AM

సీనియర్ హీరో రాజ‌శేఖ‌ర్ కారుకి ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వెళుతున్న నేప‌థ్యంలో శంషాబాద్ పెద్ద గోల్కొండ వ‌ద్ద ఓఆర్ఆర్‌పై న‌టుడు రాజ‌శేఖ‌ర్ కారు బోల్తా కొట్టింది. దీంతో ఆయ‌న కారు మూడు ప‌ల్టీలు కొట్టిన‌ట్టు తెలుస్తుంది. స‌మ‌యానికి బెలూన్స్ తెరుచుకోవ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింద‌ని స్థానికులు అంటున్నారు. రాజ‌శేఖ‌ర్‌తో పాటు మ‌రో వ్య‌క్తి కారులో ఉన్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇరువురికి స్వ‌ల్ప గాయాలయిన‌ట్టు తెలుస్తుంది. విజ‌య‌వాడ నుండి హైదరాబాద్ కి వ‌స్తున్న‌ నేప‌థ్యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని అంటున్నారు. ప్ర‌మాదంకి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.


2017 అక్టోబ‌ర్ 9న యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కారు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఆ రోజు రాత్రి పీవి ఎక్స్ ప్రెస్ హైవేపై రామిరెడ్డి అనే వ్యక్తి కారుని తన కారుతో ఢీకొట్టారు. ఆల్కహాలు తీసుకొని డ్రైవింగ్ చేయడం వలననే రాజశేఖర్ యాక్సిడెంట్ చేశాడని భాదితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, ఈ పరీక్షలో ఆయన మద్యం తీసుకోలేదని తేలింది. త‌ల్లి చనిపోయింద‌నే డిప్రెష‌న్‌లో నిద్ర‌మాత్ర‌లు వేసుకోవ‌డం వ‌ల‌న ఆ మ‌త్తులో కారు యాక్సిడెంట్ చేశాడ‌ని అన్నారు. గ‌రుడవేగ చిత్ర రిలీజ్‌కి కొద్ది రోజుల ముందే ఈ యాక్సిడెంట్ జ‌రిగింది

3493
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles