మొక్క‌కి మందు పోస్తున్న ఆర్ఎక్స్ 100 హీరో

Wed,September 18, 2019 11:45 AM

ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి విజ‌యం అందుకున్న కార్తికేయ వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్‌గా గ్యాంగ్ లీడర్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఇందులో విల‌న్‌గా అల‌రించాడు. తాజాగా 90 ఎంఎల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తికేయ స‌ర‌స‌న నేహా సోలంకి నాయిక‌గా న‌టిస్తున్నారు. శేఖ‌ర్ రెడ్డి ఎర్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్ర టీజ‌ర్ సెప్టెంబ‌ర్ 21 ఉద‌యం 10.35 ని.ల‌కి విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని పోస్ట‌ర్ ద్వారా తెలిపారు మేక‌ర్స్ . పోస్ట‌ర్‌లో కార్తికేయ మొక్క‌కి మందు పోస్తుండ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇటీవ‌ల చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి కాగా, అతి త్వ‌ర‌లో మిగ‌తా పార్ట్ పూర్తి చేసి సినిమాని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహ‌లు చేస్తున్నారు. చిత్రానికి 90 ఎంఎల్ అనే టైటిల్ ఎందుకు పెట్టామ‌న్న‌ది సినిమా చూస్తే అర్ధ‌మ‌వుతుంద‌ని చెబుతుంది చిత్ర‌బృందం.

1683
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles