డేటింగ్‌ వార్తలపై స్పందించిన బాలీవుడ్‌ నటి..

Tue,November 5, 2019 05:20 PM


న్యూఢిల్లీ: కరణ్‌జోహార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తారా సుతారియా. ఈ భామ కరీనాకపూర్‌ సోదరుడు ఆదర్‌ జైన్‌తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో..వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై తారా స్పందించింది. ‘మేం ఒకరికి కోసం ఒకరం మా సమయాన్ని కేటాయించుకుంటున్నాం. ఆదర్‌జైన్‌ నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. మేమిద్దరం భోజనప్రియులమవడంతో అప్పుడప్పుడు రెస్టారెంట్లకు వెళ్తుంటాం. ఆదర్‌జైన్‌, నేను గతేడాది దీపావళి సమయంలో స్నేహితులమయ్యాం. మేమిద్దరం కలిసి మా సమయాన్ని చాలా బాగా ఎంజాయ్‌ చేస్తున్నామని’ ముంబై మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తారాపై డేటింగ్‌ పుకార్లు రావడం కొత్తేమీ కాదు. సిదార్థ్‌ మల్హోత్రాతో సహజీవనం చేస్తుందని వార్తలు రాగా..వాటిని తారా కొట్టిపారేసింది.

6034
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles