త‌న కూతురిని ప్రపంచానికి ప‌రిచ‌యం చేసిన మ‌హాన‌టి నిర్మాత‌

Sat,October 19, 2019 01:22 PM

అల‌నాటి నటనాభినేత్రి సావిత్రి జీవిత నేప‌థ్యంలో మ‌హాన‌టి చిత్రం తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బేన‌ర్‌పై స్వ‌ప్న‌ద‌త్‌, ప్రియాంక ద‌త్ నిర్మించారు. 2018 సంవత్సరానికిగాను 66వ జాతీయ పురస్కారాల్లో మహానటి చిత్రం మూడు అవార్డులను గెలుచుకొని అగ్రభాగాన నిలిచింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంతో పాటు..సినిమాలో అద్భుతాభినయాన్ని ప్రదర్శించిన కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డును కైవసం చేసుకుంది. ఉత్తమ కాస్ట్యూమ్స్ విభాగంలో కూడా మహానటి పురస్కారాన్ని సాధించింది. అంతేకాదు ఈ చిత్రం విదేశీ ఫిలిం ఫెస్టివ‌ల్స్ లో ప్ర‌ద‌ర్శిత‌మై తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. ఇంత‌టి మ‌హోన్న‌త చిత్రాన్ని నిర్మించిన ద‌త్ సిస్ట‌ర్స్‌పై ప్ర‌తి ఒక్క‌రు ప్రశంస‌లు జ‌ల్లు కురిపించారు. అయితే మ‌హాన‌టి చిత్ర నిర్మాత‌ల‌లో ఒక‌రైన స్వ‌ప్న‌ద‌త్ 2010 డిసెంబ‌ర్‌లో ప్ర‌సాద్ వ‌ర్మ‌ని వివాహం చేసుకుంది. ఇటీవ‌ల వారికి పండంటి పాప జ‌న్మించ‌గా, ఆ పాప ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పాప‌కి న‌వ్య వైజ‌యంతి ద‌త్ వేటుకూరి అని పేరు పెట్టిన‌ట్టు పోస్ట్‌లో తెలిపింది. స్వ‌ప్న‌ద‌త్ గ‌తంలో ఎవ‌డే సుబ్ర‌హ్మాణ్యం, సుభాష్ చంద్ర‌బోస్ చిత్రాల‌కి కూడా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది.

6918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles