చైతూ బ‌ర్త్‌డే రోజు అభిమానుల‌కి డ‌బుల్ బొనాంజా

Fri,November 22, 2019 09:06 AM

అక్కినేని మూడో త‌రం వార‌సుడు నాగ చైత‌న్య త‌న కెరీర్‌లో స్లో అండ్ స్ట‌డీగా మూవీలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్ర‌స్తుతం త‌న మామ వెంక‌టేష్‌తో క‌లిసి వెంకీ మామ చేస్తున్న చైతూ.. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలోను ఓ చిత్రం చేస్తున్నాడు. నవంబ‌ర్ 23న చైతూ బ‌ర్త్‌డే కావ‌డంతో రెండు సినిమాల మేక‌ర్స్ అభిమానుల‌కి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వ‌నున్నార‌ట‌. వెంకీమామ చిత్ర బృందం చైతూ పాత్ర‌ని పరిచ‌యం చేస్తూ ఓ టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నట్టు తెలుస్తుంది. కెప్టెన్‌ కార్తీక్ పాత్రలో ఆర్మీ ఆఫీసర్‌గా చైతూ అద‌ర‌గొట్టునున్నాడ‌ని అంటున్నారు.


ఇక నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇది నాగచైతన్యకు 19వ సినిమా. ఈ సినిమాలో నాగచైతన్య కూల్ లుక్‌ని విడుద‌ల చేస్తూ , నవంబర్ 23న ఉదయం 10.30 నిమిషాలకు ఈ సినిమాలోని హీరో క్యారెక్టర్‌ని పరిచయం చేసే ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నట్టు ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ప్రేమ క‌థ‌ల‌ని ఎంతో హృద్యంగా తెర‌కెక్కించే శేఖ‌ర్ క‌మ్ముల చిత్రానికి ల‌వ్ స్టోరీ అనే టైటిల్ పెట్టిన‌ట్టు టాక్. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి ప‌వ‌న్ సంగీతం అందిస్తున్నారు.

1146
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles