ఈ సారి క‌ప‌ట‌ధారిగా వ‌స్తున్న సుమంత్

Tue,November 19, 2019 08:22 AM

ఒక‌ప్పుడు మంచి హిట్స్‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన సుమంత్ ప్ర‌స్తుతం భారీ స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. చివ‌రిగా ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో అక్కినేని నాగేశ్వ‌ర‌రావుగా న‌టించిన సుమంత్ ప్ర‌స్తుతం ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ‘క‌ప‌ట‌ధారి’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా చిత్ర టైటిల్ పోస్టర్‌, మోష‌న్ పోస్టర్‌ను కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు. క‌ప‌ట‌ధారి చిత్రం ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామ కాగా, క‌న్నడంలో సూప‌ర్‌ హిట్ అయిన ‘కావ‌లుధారి’ సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు.


తెలుగు వెర్షన్‌లో సుమంత్‌, నాజ‌ర్‌, నందిత‌, పూజా కుమార్‌, వెన్నెల కిషోర్‌, జ‌య‌ప్రకాశ్‌, సంప‌త్ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. సైమ‌న్ కె. కింగ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. విజ‌య్ ఆంటోనితో ‘భేతాళుడు’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇటీవ‌ల చెన్నైలో ప్రారంభ‌మైన ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌ర‌గుతుంది. చెన్నై, హైద‌రాబాద్ ప్రాంతాల్లో జ‌న‌వ‌రిలో జరిగే సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తారు. మార్చి నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles