సెంచ‌రీ కొట్టిన బిగ్ బాస్.. హౌజ్‌లో సంద‌డి చేసిన సుమ‌

Tue,October 29, 2019 08:05 AM

బిగ్ బాస్ సీజ‌న్ 3 స‌క్సెస్‌ఫుల్‌గా వంద ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మ‌రో ఐదు రోజుల‌లో ఈ కార్య‌క్ర‌మానికి ఎండ్ కార్డ్ ప‌డ‌నుంది. 17 మంది స‌భ్యుల‌తో మొద‌లైన బిగ్ బాస్ జ‌ర్నీలో ప్ర‌స్తుతం ఐదుగురు స‌భ్యులు మాత్ర‌మే మిగిలారు. వీరిలో ఒక‌రు విజేత‌గా నిల‌వ‌నున్నారు. ఆ విజేత ఎవ‌ర‌నే దానిపై ప్ర‌స్తుతం హాట్ హాట్ డిస్క‌ష‌న్స్ న‌డుస్తున్నాయి. అయితే గ‌త‌వారం శివ‌జ్యోతి ఎలిమినేట్ కాగా, ఈ వారం ఎలాంటి నామినేష‌న్ ప్ర‌క్రియ‌లు ఉండ‌వు.


నామినేష‌న్ ప్ర‌క్రియ లేని క్ర‌మంలో ఇంటి స‌భ్యుల‌లో జోష్ నింపేందుకు ప్ర‌ముఖ యాంక‌ర్ సుమ‌ ఇంట్లోకి అడుగుపెట్టారు. ప్రేక్ష‌కుల త‌ర‌పున నేను ఈ ఇంటికి వ‌చ్చానే త‌ప్ప‌, యాంక‌ర్‌గా రాలేద‌ని చెప్పింది సుమ‌. బెడ్ రూం, బాత్ రూం, లివింగ్ ఏరియా అన్నింటిపై ఓ లుక్కేసింది. దీపావ‌ళి విశేషాల‌ గురించి అడిగింది. సుమ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన సంద‌ర్భంగా మ‌ట‌న్ బిర్యానీకి సంబంధించిన ఐటెమ్స్ పంపారు. వాటిని వండి అంద‌రు ఆర‌గించారు.ఆ త‌ర్వాత ఇంటి స‌భ్యుల‌తో కలిసి ఫ‌న్నీ టాస్క్ ఆడింది సుమ‌.

ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు ఒకరి తరవాత ఒకరు హెడ్‌ఫోన్స్‌ను ధరించాలి. ఆ హెడ్‌ఫోన్స్‌లో మ్యూజిక్ ప్లే అవుతుంది. ఆ సమయంలో సుమ కార్డ్స్‌లోని వాక్యాలను చదివి వినిపిస్తారు. హెడ్‌ఫోన్స్ ధరించిన సభ్యుడు సుమ చెప్పిన వాక్యాన్ని కరెక్ట్‌గా చెప్పాలి. ఈ టాస్క్‌లో గెలిచిన వారు బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తారు. ఈ బెస్ట్ ఎంటర్‌టైనర్‌ను సుమ నిర్ణయిస్తారు. ఈ టాస్క్‌లో బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచినవారు తమ ఫ్యాన్ నుండి ఫోన్ కాల్ మాట్లాడే అవకాశాన్ని గెలుచుకుంటారని బిగ్ బాస్ వెల్లడించారు.

ముందుగా టాస్క్‌లో శ్రీముఖి పాల్గొన‌గా, సుమ చెప్పిన‌వ‌న్నీ క‌రెక్ట్‌గా గెస్ చేసింది. మిగ‌తా వారు ఒక‌టి రెండు మాత్ర‌మే చెప్ప‌గ‌లిగారు. అయితే ‘‘బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు’’ అని సుమ వాక్యం చదివితే.. దానికి వరుణ్ ‘‘పుచ్చకాయ పచ్చిగా ఉంది, పుచ్చకాయ పెద్దగా ఉంది’’ అని అందరినీ తెగ నవ్వించాడు. దీంతో అత‌నిని బెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సెల‌క్ట్ చేసింది సుమ‌. ఇక నేటి ఎపిసోడ్‌లోను సుమ సంద‌డి కొన‌సాగ‌నుండ‌గా, ఇంటి సభ్యులతో కలిసి ఆమె సరదాగా టపాసులు కూడా కాల్చనున్నారు.

4558
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles