బిగ్‌బాస్‌ను ఆపేయండి.. స‌మాచార‌శాఖ‌కు ఎమ్మెల్యే లేఖ‌

Thu,October 10, 2019 09:47 AM

హైద‌రాబాద్‌: హిందీలో ప్ర‌సారం అయ్యే బిగ్‌బాస్-13 షో ప్ర‌సారాల‌ను త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని ఘ‌జియాబాద్ బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. లోని(ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌) నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుర్‌జార్‌.. ఈ నేప‌థ్యంలో కేంద్ర స‌మాచార మంత్రిత్వ‌శాఖా మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌కు లేఖ రాశారు. బిగ్‌బాస్-13 షో.. స‌మాజంలో నైతిక విలువ‌ల‌ను ప‌త‌నం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. బిగ్‌బాస్ షో ద్వారా అస‌భ్య‌త కూడా విప‌రీతంగా ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. త‌క్ష‌ణ‌మే ఆ షో ప్ర‌సారాల‌ను ఆపేయాల‌ని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని వేడుకున్నారు.

4348
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles