హౌజ్‌లో నిశ్శ‌బ్దం.. ఘ‌నంగా జ‌రిగిన బిగ్ బాస్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

Sat,October 12, 2019 08:18 AM

బిగ్ బాస్ హౌజ్‌లో ఎప్పుడు అల్ల‌ర్ల‌తో టాప్ లేపే ఇంటి స‌భ్యుల నోళ్ళు కాసేపు మూయించాడు బిగ్ బాస్. త‌ను ప‌డుకుంటున్న సంద‌ర్భంగా ఇంటి స‌భ్యులు అంద‌రు సైలెంట్‌గా ఉండి టాస్క్‌లు చేయాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నాడు. ఒక‌వేళ త‌న‌ని డిస్ట‌ర్బ్ చేస్తే మీరు ప‌డుకున్న‌ప్పుడు కూడా నేను డిస్ట‌ర్బ్ చేస్తాన‌ని బిగ్ బాస్ అన్నారు. అయితే టాస్క్ కోసం శివ‌జ్యోతి, వ‌రుణ్ ల‌కి మిగ‌తా ఇంటి స‌భ్యులు కిత‌కిత‌లు పెట్టాల్సి ఉంటుంది అని తెలుప‌గా, శ్రీముఖిని అలీ త‌న వీపుపై ఎక్కించుకొని గార్డెన్ ఏరియాలో 20 రౌండ్స్ తిర‌గాల్సి ఉంటుంది.


వితికా, రాహుల్‌లు బెలూన్స్ కి ఫోమ్ పెట్టి షేవ్ చేయాలి. బాబా బాస్క‌ర్ చేతుల‌కి కాళ్ళ‌కి వ్యాక్స్ చేసుకోవాలి. మ‌హేష్ త‌ల‌మీద ప్లేట్ పెట్టుకొని చేతుల‌తో ప‌ట్టుకోకుండా గోడ‌కుర్చి వేయాల్సి ఉంటుంది. ఇంటి స‌భ్యులు త‌మ టాస్క్‌లు పూర్తి చేసే వ‌ర‌కు మ‌హేష్ గోడ కుర్చీ వేసే ఉండాలి అని బిగ్ బాస్ తెలిపారు. బిగ్ బాస్ మ్యాజిక్ మోగే అంత వ‌ర‌కు ఇంటి స‌భ్యులు టాస్క్ కొన‌సాగించారు. అయితే మ‌హేష్ ప్లేట్ ప‌డేయ‌డం, వితికా స‌రిగ్గా షేవ్ చేయ‌క‌పోవ‌డం, అలీ రెజా, శ్రీముఖి, వ‌రుణ్ సందేశ్ న‌వ్వడం వ‌ల‌న బిగ్ బాస్ త‌న నిద్ర‌కి భంగం క‌లిగింద‌ని చెబుతూ వారి నిద్ర కూడా డిస్ట‌ర్బ్ చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

ఇక బిగ్ బాస్ త‌న రూపం ఎలా ఉంటుందో ఊహించి బొమ్మ‌లు గీయాల‌ని ఇంటి స‌భ్యుల‌కి తెలిపాడు. ఈ క్ర‌మంలో ఒక్కొక్క‌రు త‌మ క్రియేటివిటీ ఉప‌యోగించి బిగ్ బాస్ రూపాన్ని గీసి, తాము అలా డ్రాయింగ్ చేయ‌డానికి గ‌ల కార‌ణం వివ‌రించారు. ఆ త‌ర్వాత ఇంటి స‌భ్యులు అంద‌రు రెనో ఫోన్‌లో ఇంటి లొకేష‌న్స్ ద‌గ్గ‌ర ఫోటోలు దిగి మ్యూజిక్ వీడియో రూపొందించారు. బిగ్ బాస్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ సంద‌ర్బంగా వీరు రూపొందించిన వీడియో ఆక‌ట్టుకునేలా ఉంది. ఇక త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కేక్‌, ఎగ్ నూడిల్స్‌, ఎగ్ ఫ్రైడ్ రైస్, మంచూరియాల‌ని ఇంటి స‌భ్యుల కోసం పంపారు బిగ్ బాస్.

2139
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles