ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ ప్రధాన పాత్రలో 90ఎంఎల్ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కార్తికేయ సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్‌లో వస్తున్న ఈ చిత్రానికి అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వం వహిస్తున్నారు . అలీ, పోసాని, రావురమేష్, రవి శంకర్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. తాజాగా ‘సింగిలు.. సింగులు.. సింగులు సింగారానివే.. నువ్వు! నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానివే’ అంటూ హీరోయిన్ నిషా సొలంకీతో కార్తికేయ ఆడిపాడాడు. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో ఈ సాంగ్ రూపొందగా, దీనికి బిగ్ బాస్2 ఫేం రోల్ రైడా ర్యాప్ అందించారు. బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్.. మానసితో కలిసి ఆలపించారు. మీరు ఈ సాంగ్‌పై ఓ లుక్కేయండి. 