స్మాల్ అప్‌డేట్ ఇచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ టీం

Sat,November 16, 2019 10:12 AM

మ‌హేష్ బాబు- అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రంపై అభిమానులలో భారీ అంచ‌నాలు ఉన్నాయి. తాజాగా చిత్రబృందం మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ లోడింగ్ అవుతుందని.. టీజర్ అతి త్వరలోనే మీ ముందుకు రాబోతుందని సోషల్ మీడియా ద్వారా చిత్రయూనిట్ తెలిజేశారు. విజ‌య‌శాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండ‌గా, ఇందులో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో మ‌హేష్ బాబు క‌నిపించ‌నున్నారు.
2451
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles