సామజవరగమనా.. మలయాళ వర్షన్ వ‌చ్చేసింది

Sun,November 10, 2019 12:41 PM

అల్లు అర్జున్ తాజా చిత్రం అల‌.. వైకుంఠ‌పుర‌ములో. ఈ చిత్రం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, జ‌న‌వ‌రి 12న మూవీ విడుద‌ల‌కి ప్లాన్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రం నుండి విడుద‌లైన రెండు పాట‌ల‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక సీతారామశాస్త్రి రాసిన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌ పాటలోని మీనింగ్ ఫుల్ లిరిక్స్‌కి సిద్ శ్రీరామ్ వాయిస్‌లోని మ్యాజిక్ కూడా కలగలిసి అద్భుతహా అనిపించింది. ఎక్క‌వ మంది లైక్ చేసిన పాట‌గా కూడా ఈ సాంగ్ రికార్డ్ సృష్టించింది. అయితే అల‌.. వైకుంఠ‌పుర‌ములో చిత్రాన్ని మ‌ల‌యాళ‌ములో అంగు వైకుంఠ‌పుర‌త్తు పేరుతో విడుద‌ల చేయ‌నున్నారు. తాజాగా చిత్రం నుండి సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా మ‌ల‌యాళ వ‌ర్షెన్ విడుద‌ల చేశారు. ప్రముఖ గాయకుడు యేసుదాస్ కొడుకు విజయ్ యేసుదాస్ మ‌ల‌యాళంలో ఈ పాట పాడారు . ఇప్పటికే 300పాటలకు పైగా పాడిన విజయ్ ఈ పాటను అద్భుతంగా పాడారు. చిత్రంలో సుశాంత్, నివేదా పెతురాజ్‌, ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సంద‌డి చేయ‌నున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

1670
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles