మూవీపై అంచ‌నాలు పెంచిన 'సాండ్ కీ ఆంఖ్' టీజ‌ర్

Thu,July 11, 2019 01:47 PM

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో రియ‌ల్ స్టోరీ చిత్రాల‌కి మంచి డిమాండ్ ఉంది. ఈ నేప‌థ్యంలో తాప్సీ, భూమి పెడ్నేకర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ‘సాండ్‌ కీ ఆంఖ్‌’ అనే చిత్రం రూపొందుతుంది . తుషార్‌ హీరానందని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర టీజ‌ర్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌లైంది. ఇందులో అక్కా చెల్లెళ్ళుగా తాప్సీ, భూమి మంచి పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ చిత్రంతో ఆమీర్ ఖాన్ సోద‌రి నిఖాత్ ఖాన్ బాలీవుడ్‌కి ప‌రిచ‌యం అవుతుంది నిఖాత్. ఇందులో మ‌హారాణి పాత్ర‌లో ఆమె కనిపించ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, సినిమా మొత్తం ఆమె క‌నిపిస్తార‌ట‌.


‘సాండ్‌ కీ ఆంఖ్‌’ చిత్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు షార్ప్‌ మహిళా షూటర్లు చంద్రో, ప్రకాశీ తోమర్‌ల జీవితాధారంగా తుషార్‌ హీరానందని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుంది. ఈ చిత్రంలో 87 ఏళ్ళ చంద్రో తోమ‌ర్ పాత్ర‌లో తాప్సీ పన్ను న‌టిస్తుండ‌గా,82 ఏళ్ళ‌ ప్రకాశీ తోమర్ పాత్ర‌లో భూమి పడ్నేక‌ర్ న‌టిస్తున్నారు. ఈ మహిళా షూటర్లకు యూపీలో ‘షూటర్‌ దాదీస్‌’గా మంచి పేరుంది. వారి స్వ‌స్థ‌లం బాగ్ ప‌ట్‌లో మూవీ చిత్రీక‌ర‌ణ కొద్ది రోజుల పాటు జ‌రిపారు. దీపావ‌ళి కానుక‌గా చిత్రం విడుద‌ల కానుంది.

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ఓ గ్రామంలో నివ‌సించే అక్కా చెల్లెళ్ళ‌కి చిన్న‌ప్పుడే పెళ్లి కావ‌డంతో త‌మ జీవితం అంతా కుటుంబం కోసం వెచ్చిస్తారు. అయితే త‌మ‌లా మిగతా వారు కాకూడ‌ద‌ని ఆరాట‌ప‌డ‌తారు. ఆ గ్రామంలో చ‌దువుల‌ని అడ్డుకునే వాళ్ళ‌ని తుపాకుల‌తో బెదిరించే వారు చంద్రో, ప్ర‌కాశీ. ఈ క్ర‌మంలో తెలియ‌ని టాలెంట్ త‌మ‌లో ఉంద‌ని గుర్తించిన ఈ ఇద్ద‌రు అక్కా చెల్లెళ్ళు ఓ సారి జాతీయ స్థాయిలో జరిగిన రైఫిల్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. అక్క‌డ నుండి వారి లైఫ్ మారింది. దాదాపు 300లకు పైగా పతకాలు సాధించారు ఈ అక్కా చెల్లెళ్ళు.

1575
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles